ఫాబ్రిక్ జువెలరీ

ఫాబ్రిక్ జువెలరీ

నగలు అనగానే… బంగారం, వెండి, వజ్రాలు, విలువైన రాళ్లతో తయారుచేసినవే కళ్ల ముందు మెదులుతాయి. నిజానికి అందంగా మలిచిన ఏ నగలు వేసుకున్నా ఆనందంగా ఉంటుంది. మరలాంటప్పుడు టెర్రాకోట లేదా ఫ్యాబ్రిక్‌తో చేసిన నగలు ఎందుకు వేసుకోకూడదు? ఫ్యాబ్రిక్‌ జువెలరీని మీ వస్త్రధారణకు ఎలా మ్యాచ్‌చేస్తే స్టయిలిష్ గా ఉంటుందో చూడండి…

 –  పలు స్టయిల్స్‌, డిజైన్లలో తయారయ్యే ఫ్యాబ్రిక్‌ జువెలరీ మీద మనసు పారేసుకోని వారు ఉండరు. చేతితో తయారుచేసిన వాటి నుంచి ఎంబ్రాయిడరీ, ఎంబలిష్‌ డిటెయిలింగ్‌లతో పలు రకాల్లో ఉంటాయి ఇవి. సింపుల్‌గా, అందంగా ఉండే నగలు కావాలంటే ఫ్యాబ్రిక్‌కు ఓటేయాల్సిందే.

– స్టయిల్‌ టిప్‌: ఫ్యాబ్రిక్‌ నెక్లెస్‌ లేదా గాజులను మ్యాక్సీ డ్రెస్‌తో కలిపి వేసుకుంటే బాగుంటుంది.

 ఫ్యాబ్రిక్‌, దారాలతో తయారుచేసే ఈ నగల్లో రంగుల హరివిల్లు కనువిందు చేస్తుంది. ఈ జువెలరీని ప్రింటెడ్‌, ప్లెయిన్‌ ఫ్యాబ్రిక్‌ లేదా దారాలతో తయారుచేస్తారు. వీటికి సంప్రదాయ, భిన్నమైన లుక్‌ తేవడం కోసం బంగారం లేదా వెండి పూసలను చేరుస్తారు.

స్టయిల్‌ టిప్‌: న్యూట్రల్‌, ఎర్తీ లేదా పేస్టల్‌ కలర్స్‌ డ్రెస్‌లకు మరిన్ని రంగులు అద్దాలంటే ముదురు రంగులతో తయారుచేసిన నెక్లెస్‌ లేదా చెవి పోగులు పెట్టుకోవాలి. వీటిమీద అద్దాలు లేదా వెండి హంగులు చేర్చితే బాగుంటుంది.

 – మిగిలిపోయిన ఫ్యాబ్రిక్‌ వాడి నగలను తయారుచేస్తారు. ఏ ప్రాంతానికి తగినట్టు ఆ ప్రాంతంలో ఇవి తయారవుతాయి. మిగతా వాటితో పోలిస్తే ఇవి ఎకో ఫ్రెండ్లీ నగలు. అంతేకాదు ఇవి వేసుకోవడం వల్ల చర్మ అలర్జీలు, దద్దుర్లు వంటివి రాకుండా ఉంటాయి.

స్టయిల్‌ టిప్‌: రోజూవారీగా వేసుకునేందుకు ఫ్యాబ్రిక్‌ జువెలరీ బాగుంటుంది. రాత్రి పూట పార్టీలకు వేసుకెళ్లాలంటే మాత్రం బాగా అలంకరించిన లేదా ఎంబ్రాయిడరీ చేసిన డిజైన్లు వేసుకోవాలి. సింపుల్‌ చేనేత చీర కట్టుకుని ఫ్యాబ్రిక్‌ నెక్లెస్‌ వేసుకుంటే స్టయిల్‌ ఐకాన్‌ మీరే.

– మిగతా నగలతో పోలిస్తే ఇవి తక్కువ ఖర్చుతో కూడినవి. అలాగే ప్రయాణాల్లో తీసుకెళ్లడం, మెయుంటెయిన్‌ చేయడం సులువు. ఈ వేసవి సెలవుల్లో టూర్‌ ప్లాన్‌ చేస్తే ఫ్యాబ్రిక్‌ జువెలరీని చాయి్‌సగా ఎంచుకుంటే ఫ్యాషన్‌ స్టేట్‌మెంట్‌కి చిరునామా మీరే!

తాజా సమాచారం

Latest Posts

Featured Videos