కశ్మీర్ అంశంలో మూడో వ్యక్తి జోక్యం అవసరం లేదు..

కశ్మీర్ అంశంలో మూడో వ్యక్తి జోక్యం అవసరం లేదు..

కశ్మీర్‌ అంశం పాకిస్థాన్‌తో తేల్చుకుంటామని అందులో మూడవ వ్యక్తి జోక్యం అవసరం లేదంటూ భారత్‌ స్పష్టంగా స్పష్టం చేసినా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మాత్రం పదేపదే కశ్మీర్‌ అంశంపై నోరు జారుతున్నారు.కొద్ది రోజుల క్రితం పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌తో భేటి సందర్భంగా కశ్మీర్‌ అంశంపై భారత ప్రధాని మోదీ తమ వద్ద ప్రస్తావించారని కశ్మీర్‌ సమస్యపై మధ్యవర్తిత్వానికి సిద్ధంగా ఉన్నామంటూ వ్యాఖ్యలు చేసి చివాట్లు తిన్న ట్రంప్‌ మరోసారి మధ్యవర్తిత్వానికి సిద్ధమంటూ వ్యాఖ్యలు చేశారు.డొనాల్డ్ ట్రంప్వ్యాఖ్యలపై భారత్ మళ్లీ స్పందించింది. భారత్పాకిస్థాన్ మధ్య నెలకొన్న వివాదాలను రెండు దేశాలే పరిష్కరించుకోవాలన్న విధానానికి తాము కట్టుబడి ఉన్నామని ప్రకటించింది. అంశంలో మూడో దేశం ప్రమేయాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. భారత విదేశాంగ మంత్రి జై శంకర్ అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియోతో జరిగిన భేటీలో విషయాన్ని స్పష్టం చేశారు. భారత్, పాక్ ద్వైపాక్షిక చర్చల్లో ఇతరుల మధ్యవర్తిత్వాన్ని అనుమతించబోమని తేల్చి చెప్పారు. భేటీ అనంతరం భారత విదేశాంగ శాఖ మేరకు ప్రకటన జారీ చేసింది. ప్రధాని నరేంద్రమోడీ ఆదేశాల మేరకు ప్రకటన జారీ చేసినట్లు సమాచారం.పదేపదే కశ్మీర్‌ అంశాన్ని తెరపైకి తెస్తూ మూడవ వ్యక్తి జోక్యం అవసరం లేదంటూ భారత్‌ స్పష్టం చేస్తున్నా మధ్యవర్తిత్వానికి సిద్ధమంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేస్తున్న వ్యాఖ్యల వెనుక ఉద్దేశమేంటనేది అంతుచిక్కడం లేదు.కశ్మీర్‌ అంశాన్ని ఆసరాగా తీసుకొని తమ హెచ్చరికలు ఖాతరు చేయకుండా రష్యాతో ఆయుధాల కొనుగోలు ఒప్పందాలు చేసుకుంటున్న భారత్‌ను తన నియంత్రణలోకి తెచ్చుకోవడానికి ట్రంప్‌ చేస్తున్న ఈ ఎత్తుగడ వేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos