జంతువు మలంతో తయారయ్యే కాఫీ…చాలా ఖరీదు సుమా..!

జంతువు మలంతో తయారయ్యే కాఫీ…చాలా ఖరీదు సుమా..!

కోపీ లువాక్‌.. ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన కాఫీల్లో ఇదొక‌టి. ఇండోనేసియా స‌మీప ప్రాంతాల్లో మాత్ర‌మే ఈ కాఫీ గింజ‌లు ల‌భ్య‌మ‌వుతాయి. ఈ గింజ‌ల‌తో త‌యార‌య్యే ఒక క‌ప్పు కాఫీ తాగాలంటే 4 నుంచి 5 వేల రూపాయ‌ల వ‌ర‌కు ఖ‌ర్చు పెట్టాల్సిందే. అయితే ఈ కాఫీ గింజ‌ల‌ను ఎలా సేక‌రిస్తారో తెలిస్తే మాత్రం అదోర‌కమైన ఫీలింగ్ క‌లుగుతుంది. ఇండోనేసియా, సుమ‌త్రా దీవుల్లో ఉండే ఆసియ‌న్ పామ్ సివెట్ అనే జంతువుకు కాఫీ చెర్రీస్‌ను తినిపిస్తారు. వాటిని తిన్నకొద్ది సేప‌టి అనంతరం ఆ జంతువు నుంచి వ‌చ్చిన మ‌లాన్ని సేక‌రించి దానితో ఈ కాఫీ పొడిని త‌యారుచేస్తారు. ఇందుకోసం ఆ జంతువుల‌ను చిన్న చిన్న బోనుల్లో బంధించి వాటికి కాఫీ చెర్రీల‌ను మాత్ర‌మే ఆహారంగా పెడ‌తారు. అనంత‌రం వాటి నుంచి మ‌లం రూపంలో బ‌య‌ట‌కు వ‌చ్చిన కాఫీ గింజ‌ల‌ను సేక‌రిస్తారు. ఇలా చేయ‌డం వ‌ల్లే కోపీ లువాక్ కాఫీకి అద్భుత‌మైన రుచి వ‌స్తుంద‌ట‌. ఇలా కాఫీ కోసం ఆ జంతువుల‌ను హింసిస్తున్నందుకు గ‌తంలో నిర‌స‌న‌లు కూడా వ్య‌క్త‌మ‌య్యాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos