ఆదాయానికి గండి పడింది ..ఆదుకోండి

ఆదాయానికి గండి పడింది ..ఆదుకోండి

అమరావతి: కరోనా కారణంగా ఆదాయానికి బాగా గండి పడినందున ఆదుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి గురువారం ప్రధాని నరేంద్ర మోదీకి విన్నవించారు. ప్రధాని మోదీ గురువారం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కరోనా స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారు. . కరోనా వ్యాప్తి నివారణకు రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలను ప్రధానికి ముఖ్యమంత్రి వివరించారు. గత రెండు రోజుల్లో కేసుల సంఖ్య పెరగడానికి గల కారణాలను వెల్లడించారు. ఇప్పటి వరకు నమోదైన 132 కరోనా పాజిటివ్ కేసుల్లో 111 మంది జమాత్కు వెళ్లిన వారు, వారితో సంబంధాలు ఉన్నావారేనన్నారు. కుటుంబం వారీగా చేస్తున్న సర్వే అంశాలను వివరించారు. బాధితులను క్వారంటైన్, ఐసోలేషన్కు తరలించి వైద్య సదుపాయాలు అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ఆదాయం బాగా దెబ్బదిన్నందున తగిన విధంగా ఆదుకోవాలని కోరారు. వైద్య పరికరాలను అధిక సంఖ్యలో అందించాలని విజ్ఞప్తి చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos