బాలీవుడ్‌కు జెర్సీ!

  • In Film
  • June 25, 2019
  • 134 Views
బాలీవుడ్‌కు జెర్సీ!

దశాబ్ద కాలంగా బాలీవుడ్‌ పూర్తిగా దక్షిణాది సినిమాలపై ఆధారపడి కాలం వెళ్లదీస్తోంది.దక్షిణాది చిత్రాలను రీమేక్‌ చేసుకోవడం లేదా డబ్బింగ్‌ రూపంలో విడుదల చేసుకోవడానికి రైట్స్‌ కొనుగోలు చేసుకోవడం ఇలా దక్షిణాదిపై ఆధారపడుతోంది.ముఖ్యంగా తెలుగు చిత్రాలపై బాలీవుడ్‌ దర్శకనిర్మాతలు ప్రత్యేక దృష్టి,ఆసక్తి కనబరుస్తున్నారు. తాజాగా అర్జున్‌రెడ్డికి రీమేక్‌గా తెరకెక్కిన కబీర్‌సింగ్‌ సాలిడ్‌హిట్ కొట్టడంతో మరిన్ని తెలుగు చిత్రాలను బాలీవుడ్‌లో రీమేక్‌ చేయడానికి బాలీవుడ్‌ దర్శకనిర్మాతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు.ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలైన నాని హీరోగా నటించిన జెర్సీ చిత్రాన్ని బాలీవుడ్‌లో రీమేక్‌ చేయడానికి దర్శకనిర్మాత కరణ్‌ జొహార్‌ రీమేక్‌ రైట్స్‌ తీసుకున్నట్లు సమాచారం.హిందీ వెర్షన్ కి సైతం  గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించనుండగా నాని పోషించిన పాత్రలో బాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో షాహిద్ కపూర్ నటిస్తారట..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos