పేదలకు శాపమైన బ్యాంకు నియమాలు

పేదలకు శాపమైన  బ్యాంకు నియమాలు

భువనేశ్వర్ (ఒడిశా) : వృద్ధాప్య ఫించను కోసం మంచాన పడిన 120 ఏళ్ల తల్లిని బ్యాంకుకు తరలించటం కూతురుకు అనివార్యమైంది. నౌపద జిల్లా, ఖరియర్ బ్లాకులోని బరాగన్ గ్రామానికి చెందిన లాభీ బాగేల్ అనే 120 ఏళ్ల వృద్ధురాలు అనారోగ్యంతో మంచాన పడ్డారు. వృద్ధురాలైన లాభీ బాగేల్ తనకు రావాల్సిన 1500రూపాయల పించన్ తీసుకురమ్మని తన కుమార్తె అయిన గుంజాదేవిని బ్యాంకుకు పంపించింది. బ్యాంకు అధికారులు తల్లికి ఇవ్వాల్సిన పెన్షన్ కూతురికి ఇవ్వమని, ఆమెను బ్యాంకుకు తీసుకు వస్తేనే ఫించను ఇస్తామని సెలవిచ్చారు. దీంతో 70 ఏళ్ల గుంజాదేవి తన 120 ఏళ్ల వయసుగల తల్లిని మంచంపైనే పడుకోబెట్టి ఏకంగా మంచాన్నే బ్యాంకుకు లాక్కోచ్చింది.దీంతో బ్యాంకుకు అధికార్లు కరుణించారు. హృదయవిదారకమైన ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో ఎక్కింది. రూ.1500 ఫించను ఇచ్చేందుకు ఇద్దరు వృద్ధ మహిళలను ఇబ్బంది పెట్టిన బ్యాంకుఅధికారులపై నెటిజన్లు దుయ్యబట్టారు. వారికి ఫించను ఇంటివద్దే అందించాలని బీఎంసీ కమిషనర్ ప్రేమ్ చంద్ చౌదరి అన్ని బ్యాంకుల మేనేజర్లు, రిజర్వ్ బ్యాంకులను కోరారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos