ఈ సినిమాతో బాక్సాఫీసు బద్ధలే

  • In Film
  • April 25, 2019
  • 118 Views
ఈ సినిమాతో బాక్సాఫీసు బద్ధలే

భారీ అంచనాలతో విడుదలైన అవెంజర్స్‌ ఎండ్‌ గేమ్‌ సినిమా ప్రపంచ చలన చిత్ర పరిశ్రమలోని గత కలెక్షన్ల రికార్డులన్నిటినీ చెరిపివేస్తుందనే అంచనాలు ఎక్కువవుతున్నాయి. ఈ సినిమా  సుమారు రూ.20 వేల కోట్ల దాకా వసూలు చేస్తుందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. ఇండియాలో కూడా దీనికి అడ్వాన్స్‌ బుకింగ్స్‌ అదే స్థాయిలో ఉన్నాయి. మల్టీప్లెక్స్‌లలో టికెట్ల కోసం ప్రేక్షకులు బారులు తీరుతున్నారు. ఇప్పటికే పది లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. చైనాలో ఈ సినిమా తొలి రోజు వసూళ్లు రూ.750 కోట్ల పైమాటే. దీంతో తొలి రోజు ఆసియాలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా కీర్తి గడించింది. అవతార్‌ సినిమా రికార్డులు కూడా బద్ధలవుతాయని చెబుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos