అంజలికి అరవోళ్లే నచ్చుతారట..

  • In Film
  • June 25, 2019
  • 144 Views
అంజలికి అరవోళ్లే నచ్చుతారట..

అందం,అభినయంతో తెలుగు,తమిళంలో గుర్తింపు తెచ్చుకున్న నటి అంజలి మాటలతో,చేష్టలతో అప్పుడప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు.తాజాగా మరోసారి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అంజలి వార్తల్లో నిలిచారు.విజయ్‌ సేతుపతి హీరోగా తెరకెక్కిన సింధూబాద్‌ చిత్రం విడుదల సందర్భంగా ప్రమోషన్స్‌లో పాల్గొన్న అంజలి సినిమా విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలు కూడా వెల్లడించారు.సినిమాలో విజయ్ సేతుపతి కొంచెం చెవుడు కలిగిన పాత్రలో కనిపిస్తారని.. తాను గ్రామంలో నివసించే సాధారణ యువతిగా నటించానని చెప్పారు.హీరోల్లో మీకు ఎవరైనా ప్రపోజ్ చేశారా..? అని ప్రశ్నించగా.. తాను నటించిన హీరోలలో ఎక్కువమందికి పెళ్లిళ్లు అయ్యాయని చెప్పింది. నటుడు జైకే ఇంకా పెళ్లి కాలేదని.. తను ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడో  తెలియదని చెప్పారు.ఇక తాను పెళ్లి చేసుకుంటే మాత్రం కచ్చితంగా తమిళ అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని చెప్పారు.అంజలి తెలుగు అమ్మాయే అయినా గుర్తింపు లభించింది,ఎక్కువగా నటిస్తోంది తమిళ చిత్రాల్లోనే కావడంతో తమిళులపై అంజలికి ప్రేమ పుట్టుకొచ్చి ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos