బీజేపీకి ఎస్‌బీఎస్పీ ఝలక్!

బీజేపీకి ఎస్‌బీఎస్పీ ఝలక్!

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ మిత్రపక్షం సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్‌బీఎస్పీ) కాషాయపార్టీ లక్ష్యంగా స్వరం పెంచింది. ఇచ్చిన హామీకి కట్టుబడి 27 శాతంగా ఉన్న బీసీ రిజర్వేషన్లను వర్గీకరించాల్సిందేననీ.. లేని పక్షంలో తాము వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపెట్టుకోబోమని స్పష్టం చేసింది. ‘‘ఎన్నికలకు ఇంకా 80 రోజులే ఉంది. మరి ఈ హామీని ఎప్పుడు అమలు చేస్తారు? మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుంటే మొత్తం 80 స్థానాల్లోనూ మేము పోటీ చేస్తాం…’’ అని ఎస్‌బీఎస్పీ చీఫ్, యూపీ మంత్రి ఓపీ రాజ్‌బర్ పేర్కొన్నారు. వచ్చే 25 నాటికి తమ పార్టీ అభ్యర్థుల పేర్లు వెల్లడిస్తామన్నారు. యూపీలో చిరకాల ప్రత్యర్థులైన ఎస్పీ-బీఎస్పీ పార్టీలు జతకట్టడం బీజేపీకి పెను సవాలేనంటూ రాజ్‌బర్ కుమారుడు, ఎస్‌బీఎస్పీ ప్రధాన కార్యదర్శి అరవింద్ వ్యాఖ్యానించిన కొద్ది రోజులకే రాజ్‌బర్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. ‘‘ఓమ్‌ ప్రకాశ్ రాజ్‌బర్ డిమాండ్ మేరకు ఓబీసీ రిజర్వేషన్లను వర్గీకరించకపోతే… ఎస్పీ-బీఎస్పీ కూటమితో బీజేపీకి పెనుసవాల్ తప్పదు…’’ అని అరవింద్ ఇటీవల పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos