ఒత్తిడా… నవ్వేయండి!

ఒత్తిడా… నవ్వేయండి!

 ఒత్తిడి మన జీవితంలో ఓ భాగం అయిపోయింది. దానికి కారణాలు ఎలాంటివైనా పరిష్కారం ముఖ్యం కాబట్టి… ఒత్తిడి నుంచి ఎలా బయటపడొచ్చో చూద్దాం. మనలో చాలామంది తేలిగ్గా తీసుకుంటాం కానీ… ఒత్తిడిని నివారించడంలో వ్యాయామం కీలకంగా పని చేస్తుంది. వేగంగా వ్యాయామం చేయడం వల్ల గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. చెమట పడుతుంది. శరీరం కూడా చురుగ్గా మారుతుంది. శరీరంలో ఎండార్ఫిన్లు అనే ఫీల్‌గుడ్‌ హార్మోన్లు విడుదల అవుతాయి. అవి ఒత్తిడిని పెంచే హార్మోన్లను తగ్గిస్తాయి. కాబట్టి ఎన్ని పనులు ఉన్నా… వ్యాయామం చేసేందుకు సమయం పెట్టుకోండి. మనకు ఉన్న కొన్ని సమస్యలు కూడా ఒత్తిడికి దారితీస్తాయి. అలాంటప్పుడు వాటి గురించి ఆలోచించి, బాధపడటం కన్నా ఏ మార్గాల్లో పరిష్కరించొచ్చో ఆలోచించాలి. కచ్చితంగా మార్పు ఉంటుంది. ఎప్పుడూ పనులతోనే గడిపేస్తుంటాం.  ఒకదాని తరువాత మరొకటి అంటూ ఎన్నో పనులు చేసుకుంటూ పోతాం. కానీ మీ కోసం మీరు కొంత సమయం పెట్టుకుని ఆ పనుల ఒత్తిడి నుంచి బయటపడాలి. కుదిరితే కాసేపు నవ్వుకోవడం, నచ్చిన పని చేయడం, అభిరుచులపై ఆసక్తి చూపించడం వంటివాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. వాటివల్ల ఎంతో మార్పు ఉంటుంది. కనీసం నెలా, రెణ్నెల్లకోసారి స్పాలో లేదా ఇంట్లోనే బాడీ మసాజ్‌కి ప్రాధాన్యం ఇవ్వాలి. దీనివల్ల కండరాలు, నాడీవ్యవస్థ పనితీరు బాగుండటమే కాదు, ఒత్తిడి కూడా దూరమవుతుంది. ఒత్తిడి తాలూకు హార్మోన్లు కూడా బయటకు పోతాయి. రోజులో వీలైనంత ఎక్కువ కూరగాయలు, పండ్లు తీసుకునేవారు ఆనందంగా ఉంటున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి జంక్‌ ఫుడ్‌ని తగ్గించి, పండ్ల ముక్కలు, కూరగాయల సలాడ్లు ఎక్కువగా తీసుకునేలా చూసుకోవాలి. క్యారెట్‌, కీరలాంటివయితే కుదిరినప్పుడల్లా విడిగానే తీసుకోవచ్చు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos