అదో పెద్ద జోక్… బీజేపీతో పొత్తుపై అన్నాడీఎంకే..!

అదో పెద్ద జోక్… బీజేపీతో పొత్తుపై అన్నాడీఎంకే..!

చెన్నై: తమిళనాడులో బీజేపీతో పొత్తపెట్టుకోవాల్సిన అవసరం తమకు లేదంటూ అన్నాడీఎంకే కుండబద్దలు కొట్టింది. బీజేపీని వీపుమీద మోసే కంటే తమ సొంత క్యాడర్‌ను బలోపేతం చేసుకోవడమే మేలని స్పష్టం చేసింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు తమిళనాట పొత్తులకు అవకాశం ఉందంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలపై ఊహాగానాలు ఊపందుకున్న నేపథ్యంలో అన్నాడీఎంకే ఈ మేరకు స్పందించడం విశేషం. ‘‘బీజేపీని మా వీపు మీద మోస్తామనడం, తమిళనాట వాళ్లకు బలపడేందుకు అవకాశమిస్తామనడం కంటే పెద్ద జోక్ ఇంకోటి ఉండదు.. మా సొంత కేడర్‌ను మేము బలోపేతం చేసుకుంటాం. వాళ్లు సంగతి వాళ్లు చూసుకుంటారు..’’ అని అన్నాడీఎంకే నేత తంబిదురై పేర్కొన్నారు. కాగా గత వారం బీజేపీ క్షేత్రస్థాయి కార్యకర్తలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరమైన చర్చకు దారితీశాయి. పొత్తుల కోసం తమ పార్టీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయనీ… పాత మిత్రుల ప్రయోజనాలు కాపాడతామని ఆయన అన్నారు. ‘‘1990ల్లో దివంగత నేత అటల్ బిహారీ వాజ్‌పేయి నాయకత్వంలో సంకీర్ణ రాజకీయాలు విజయవంతంగా మొదలయ్యాయి. ఆయన చూపిన బాటలోనే పొత్తులకు బీజేపీ తలుపులు ఎప్పుడూ తెరిచేఉంటాయి..’’అని ప్రధాని పేర్కొన్నారు. 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos