చిరు-జగన్ మధ్య సత్సంబంధాలు ఉండరాదనే తెదేపా కుట్ర..

చిరు-జగన్ మధ్య సత్సంబంధాలు ఉండరాదనే తెదేపా కుట్ర..

మెగాస్టార్ చిరంజీవితో తనకు మనస్పర్ధలు,గొడవలు ఉన్నాయంటూ వినిపిస్తున్న వార్తలను వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఖండించారు.ఈ మేరకు ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు.మెగాస్టార్ చిరంజీవితో తనకు ఎలాంటి గొడవలు లేవని స్పష్టం చేశారు. చిరంజీవిపై తన అభిమాన సంఘం పేరిట సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్ని ఖండించారు. తన అభిమాన సంఘం పేరుతో సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్న పోస్టులకు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తనకు ట్విట్టర్ అకౌంట్లు గానీ ఫేస్ బుక్ అకౌంట్లు గానీ,అభిమాన సంఘాలు గానీ లేవన్నారు.అభిమాన సంఘాలు అంటూ ఉంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మాత్రమే ఉంటాయన్నారు. తాను కూడా జగనన్న అభిమానినేనని చెప్పుకొచ్చారు.తాను తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌గా ఉన్న రోజుల్లో చిరంజీవి ఎమ్మెల్యేగా ఉండేవారని అప్పటి నుంచే చిరంజీవితో తనకు సత్సంబంధాలే ఉన్నాయని చెప్పుకొచ్చారు.సీఎం జగన్, చిరంజీవి మధ్య సంత్సబంధాలు ఉండకూడదన్న క్షుద్ర ఆలోచనలతో తెలుగుదేశం పార్టీయే ఈ దుష్ప్రచారం చేస్తుందని ప్రభుత్వ విప్ చెవిరెడ్డి ఆరోపించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos