శివసేకు హోటల్‌ రక్షణ

శివసేకు హోటల్‌ రక్షణ

ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు ప్రతిష్టంభన కొనసాగుతోంది. శాసనసభ గడువు 9న ముగియనుండటంతో పార్టీలు వేగంగా పావుల్ని కదుపుతున్నాయి. తమ శాసనసభ్యులు ఆపరేషన్ కమలకు గురికాకుండా కాపాడుకునేందుకు శివసేన వారిని ఇక్కడి ఐదు నక్షత్రాల హోటల్కు తరలించనుంది. ముఖ్యమంత్రి పదవి కాలాన్ని చెరి సగం పంచుకోవాలనేది శివసేన వాదన. ఎన్సీపీ మద్దతు కూడా కరువు కావటంతో శివసేన బుధవారం కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపించింది. . ఏమైందో ఏమో కానీ గురువారం తన పంతాన్ని వీడేది లేదని కుండ బద్దలు కొట్టింది. తమ సభ్యుల్ని హోటల్కు తరలించనున్నట్లు వచ్చిన వార్తల్ని శివసేన పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ ఖండించారు. తమ ఎమ్మెల్యేలు పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారన్నారు. అయినా వారి జోలికొచ్చే సాహసం ఎవరూ చేయబోరని దీమా వ్యక్తీకరించారు. ఇలాంటి అసత్యాలను ప్రచారం చేస్తున్నవారు తమ శాసనసభ్యుల గురించి ముందుగా ఆందోళన చెందాలన్నారు. శివసేనకు చెందిన వ్యక్తే ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠిస్తారని పునరుద్ఘాటించారు.ప్రభుత్వం ఏర్పాటులో తుది నిర్ణయాధికారం అధికారం ఉద్ధవ్దేనని శివసేన శాసనసభా పక్ష సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించిందని శాసన సభ్యుడు దేశాయ్ విలేఖరులకు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos