సంతులిత అభివృద్ధికే మూడు రాజధానులు

సంతులిత అభివృద్ధికే మూడు రాజధానులు

అమరావతి : అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ది కోసం సీఆర్డీఏను రద్దు చేసినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం శాసనసభలో ప్రకటించారు. అంతకు ముందు సంబంధిత ముసాయిదాను సభలో ప్రవేశ పెట్టారు. ఇందుకు దారి తీసిన పరిస్థితుల్ని వివరించారు. ‘ప్రాంతీయ అసమానతల వల్లే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది. కొత్త రాష్ట్రం రాజధాని కోసమని సీఆర్డీఏ చట్టం చేశారు. గత ప్రభుత్వం అసమానతలు తొలగించడానికి ప్రయత్నించ లేదు. ఒకే ప్రదేశంలో అభివృద్ధి పరిపాలనను కేంద్రీకరించింది. ఇతర ప్రాంతాలవారి అవసరాలను, మనోభావాలను తాత్సారం చేసింది. ఆర్థిక పరిస్థితిని కూడా బేరీజు వేసుకోలేదు. రాజధాని ఏర్పాటు గురించి కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ చేసిన సిఫార్సులను గత ప్రభుత్వం పరిగణించ లేదు. ఏకపక్షంగా నిర్ణయించారు. అభివృద్ధి అంటే 13 జిల్లాల అభివృద్ధి, 5 కోట్ల మంది అభివృధ్ది చెందాలని ఈ ముసా యిదాను తీసుకొచ్చాం. బోస్టన్ కమిటీ, జీఎన్ రావు ఇచ్చిన నివేదికల్ని ఉన్నత స్థాయి సమితి క్షుణ్ణంగా పరిశీలించి సిఫార్సుల్ని చేసింది. సంతులిత అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ, వనరులన్నీ కేంద్రీకృతం కాకుండా 13 జిల్లాలకు వాటి ఫలాలు అందాలనీ సిఫార్సు చేసింది. దాని ప్రకారం సీఆర్డీఏను రద్దు చేస్తున్నాం. భూమిలిచ్చిన రైతులకు అన్యాయం కలగనివ్వం. గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పం దాలకు కట్టుబడి ఉన్నాం. దాని కంటే మిన్నగా రైతులకు ఇవ్వాలని సిఫార్సు చేసింద’ని విపులీకరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos