రష్యా వ్యాక్సిన్‌తో సత్ఫలితాలు

రష్యా వ్యాక్సిన్‌తో సత్ఫలితాలు

న్యూ ఢిల్లీ: రష్యా కరోనా టీకా – స్పూత్నిక్-5 ఎంతో సురక్షితమైనది. ప్రభావవంతంగా పని చేస్తుందని తేలింది. ది మాస్కో టైమ్స్ ప్రకారం అనుసరించి కరోనా వ్యాక్సిన్ స్పూత్నిక్-5 తీసుకున్న వాలంటీర్లలోని 85 శాతం మందిలో ఎటువంటి దుష్ప్రభావాలు కనిపించలేదని వ్యాక్సిన్ను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలే స్వయంగా ప్రకటించారు. రష్యా ఈ స్పూత్నిక్-5 వ్యాక్సిన్ను మాస్కోకు చెందిన గమలేయ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎపిడిమియోలజీ, మైక్రోబయోలజీల సహకారంతో అభివృద్ధి చేసింది. ఈ విషయాన్ని రష్యా గత ఆగస్టులోనే వెల్లడించింది. తాజాగా ఈ వ్యాక్సిన్ గురించి గమలేయ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడిమియోలజీకి చెందిన శాస్త్రవేత్త అలగ్జాండర్ గింటూస్బర్గ్ మాట్లాడుతూ స్పూత్నిక్-5 కారణంగా స్వల్ప దుష్ఫ్రభావాలు ఎదురవుతున్నాయని, స్వల్ప జ్వరం, తలనొప్పి మొదలైనవి కనిపిస్తున్నాయన్నారు. ఇటువంటి సైడ్ఎఫెక్ట్స్ కేవలం 15 శాతం మందిలోనే కనిపిస్తున్నాయన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న 85 శాతం వాలంటీర్లలో ఎటువంటి దుష్ప్రభావాలు కనిపించలేదని తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos