సాఫ్ట్‌వేర్ శారద దుకాణంలో చోరీ..

సాఫ్ట్‌వేర్ శారద దుకాణంలో చోరీ..

లాక్ డౌన్ ప్రభావంతో ఉద్యోగం కోల్పోయి రోడ్డుపై కూరగాయలు అమ్ముకుంటున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ శారదకు మరో కష్టం వచ్చింది.శారద కూరగాయల దుకాణంలో చోరీ జరిగింది. మంగళవారం రాత్రి కూరగాయలు విక్రయించిన తర్వాత మిగతా వాటిని బండిపైనే ఉంచి కవర్‌తో కప్పి రోజూలానే ఇంటికి వెళ్లిపోయింది. అయితే, ఆ తర్వాతి రోజు దుకాణానికి వస్తే బండిపై ఉండాల్సిన కూరగాయలు మాయమయ్యాయి. మొత్తంగా రూ. 5 వేల విలువైన కూరగాయలు మాయమైనట్టు శారద ఆవేదన వ్యక్తం చేసింది.సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన శారద కూరగాయలు విక్రయిస్తూ డిగ్నిటీ ఆఫ్ లేబర్‌కు ప్రతీకగా నిలిచిందని ప్రశంసలు వెల్లువెత్తాయి. ఆమె గురించి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నటుడు సోనూసూద్ స్పందించి ఉద్యోగం ఆఫర్ చేసిన విషయం తెలిసిందే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos