సైరా సినిమా చూసిన ఎస్ఐలు వీఆర్‌కు…

సైరా సినిమా చూసిన ఎస్ఐలు వీఆర్‌కు…

కర్నూలు : విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ సైరా నరసింహారెడ్డి చిత్రం తొలి షో చూసినందుకు ఆరుగురు ఎస్ఐలపై వేటు పడింది. ఒకే బ్యాచ్‌కు చెందిన ఆరుగురు ఎస్ఐలు కోవెలకుంట్లలో చిత్ర ప్రదర్శనకు వెళ్లారు. వీరు సినిమా తిలకించడాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో కూడా పెట్టారు. దీనిపై జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప సీరియస్ అయ్యారు. విధి నిర్వహణలో ఉన్న సమయంలో సినిమా ఎలా చూస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు సినిమా చూసింది నిజమేనని నిర్ధరించుకున్నాక, విధుల పట్ల నిర్వక్ష్యం వహించారన్న ఆరోపణపై అందరినీ వేకెన్సీ రిజర్వ్ (వీఆర్)కు పంపి, జిల్లా కేంద్రంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos