మత విద్వేషాలను రెచ్చగొట్టేలా మోడీ ప్రసంగాలు

మత విద్వేషాలను రెచ్చగొట్టేలా మోడీ ప్రసంగాలు

నెల్లూరు : ఈ ఎన్నికల ప్రచారంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఆయన మంత్రి వర్గంలోని మంత్రులు మత విద్వేషాలను రెచ్చగొట్టేవిధంగా ప్రసంగాలు చేస్తున్నారని, దీనిని ప్రజలు క్షమించరని ప్రముఖ రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు డాక్టర్ పరకాల ప్రభాకర్ పేర్కొన్నారు. భారత దేశం శతాబ్దాల పాటు పోరాడి సాధించుకున్న ప్రజాస్వామ్యం ప్రస్తుతం ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాలోని జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ‘నేటి భారతం- సవాళ్లు’ అన్న అంశంపై ఆదివారం నిర్వహించిన సదస్సుకు డాక్టరు రామచంద్రా రెడ్డి ప్రజా వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టరు బి రాజేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సదస్సులో ముఖ్యవక్తగా పరకాల మాట్లాడుతూ గడిచిన పదేండ్లుగా దేశ ఆర్థిక వ్యవస్థ, మన రాజ్యాంగ విలువలు, విధ్వంసానికి గురయ్యాయని, ప్రభుత్వం, అధికార పక్షం దేశాన్ని విధ్వంసంవైపు తీసుకెళ్తున్నాయని వివరించారు. మణిపూర్ ప్రాంతంలో విధ్వంసం జరిగితే మనకేంటి అనుకోవడం సరికాదన్నారు. అక్కడ జరుగుతున్న మారణకాండ, మారణహోమం మిగిలిన రాష్ట్రాలలో జరిగేటటువంటి అతిపెద్ద ప్రమాదం దేశంలో పొంచి ఉందన్నారు. దేశంలో నిరుద్యోగం ప్రబలిపోయిందని, ధరలు అదుపులో లేవన్నారు. అధికార పార్టీకి ఓట్లు వేసి తిరిగి అధికారాన్ని కట్టబెడితే దేశం సంక్షోభంలో పడుతుందన్నారు. ప్రధాన మంత్రి బయట మాట్లాడటం కాదు.. ఆగస్టు 15న ఏకంగా ఎర్రకోట మీదకు ఎక్కి ఇటువంటి పిలుపునిచ్చే ప్రమాదం ఉందని పిలుపునిచ్చారు.

తాజా సమాచారం