జితిన్ ది ప్రసాద రామ రాజకీయాలు.

జితిన్ ది  ప్రసాద రామ రాజకీయాలు.

న్యూ ఢిల్లీ: ‘కాంగ్రెస్ పార్టీలో సంస్కరణలు చేయాల్సిన తరుణం వచ్చింది. మేము చెప్పే మాటలను నాయకత్వం ఇకనైనా వినాల’ని గురువారం ఒక దృశ్య మాధ్యమ సంస్థ ముఖాముఖిలో పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ విజ్ఞప్తి చేశారు. ‘పార్టీలోని సమస్యలు ఇంకా పరిష్కరం కాలేదు. అది నిజం. అవి పరిష్కరం కానంత వరకూ వాటి గురించి వేలెత్తి చూపుతూనే ఉంటాము. నాయకత్వం విఫలమైతే నేతలందరూ విఫలమైనట్టే. ఒక వేళ మా అవసరం లేదు. వెళ్లిపొమ్మంటే వెళ్లిపోతాం. బీజేపీలో మాత్రం చేరం. నేను పుట్టినప్పటి నుంచి ఆ పార్టీకి వ్యతిరేకం. నేను బీజేపీలో చేరడమంటే చచ్చి పోయినట్టే లెక్క’అని పేర్కొన్నారు. భాజపాలో జితిన్ ప్రసాద చేరికపై ఘాటుగా స్పందించారు. ‘అది ప్రసాద రామ రాజకీయాలు. సిద్ధాంతాలను పక్కన బెట్టి కేవలం స్వార్థ ప్రయోజనాల కోసమే పార్టీని వీడారు. నాకు పార్టీ ఏం చేసింది? ఏం చేయలేదు? అన్నది అనవసరం. ప్రస్తుత రాజకీయాలకు ఓ సిద్ధాంతమంటూ లేకుండాపోయింది. పార్టీని వీడడంలో జితిన్ కు కారణాలుండి ఉండొచ్చు. ఆయన పార్టీని వీడినందుకు విమర్శలు చేయాల్సిన అవసరం లేదు. పార్టీని వీడేందుకు ఆయన చెప్పిన కారణాలనే విమర్శించాలన్నా’రు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos