బయటపడుతున్న రియా చక్రవర్తి కుట్రలు..

సుప్రీంకోర్టు ఆదేశం మేరకు ఈ కేసు విచారణను చేపట్టిన సీబీఐ.. గత వారం రోజులుగా ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. ఇందులో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే, సీబీఐ కంటే ముందు.. బ్యాంకు ఖాతా నుంచి నిధుల తరలింపుపై సుశాంత్ ప్రియురాలు, బాలీవుడ్ నటి రియా చక్రవర్తిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) విచారించింది. ఈ విచారణలో పలు ఆస్తికరమైన విషయాలు వెలుగు చూసింది. డ్రగ్స్ పేరుతో రియా చక్రవర్తికి నేరుగా సంబంధాలున్నట్లు ఈడీ తేల్చింది.సుశాంత్ స్నేహితులు కూడా డ్రగ్స్ తీసుకునేవాళ్లని ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణలో వెల్లడైంది. రియా నేరుగా డ్రగ్స్ వ్యాపారులను సంప్రదించేదని ఈడీ తెలిపింది.దీంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకి ఈడీ తాజాగా లేఖ రాసింది. అలాగే, రియాకు డ్రగ్స్ డీలర్లకు మధ్య జరిగిన సంభాణలను కూడా ఈడీ అధికారులు సీబీఐ అధికారులతో పంచుకున్నారు.డ్రగ్ డీలర్ తో రియా వాట్సాప్ సంభాషణ హీటెక్కిస్తోంది. డ్రగ్ డీలర్ గౌరవ్ ఆర్యతో సంభాషణలో నిషేధిత మిథైలెండిక్సీ మీతమ్ ఫెటామైన్ అనే ప్రమాదకర మాదక ద్రవ్యాన్ని రియా అడిగింది. “హైపవర్ డ్రగ్స్ గురించి సమాచారం కావాలి… అలాంటివి ఎప్పుడూ వాడలేదు“ అంటూ రియా కోట్ చేస్తూ సదరు డ్రగ్ డీలర్ ని అడిగింది. 2017లో చాట్ అయినా దీని వెనక ఇంకేదైనా కుట్రకోణం దాగి ఉందా? అన్న విచారణ సాగుతోంది.అలాగే స్మాల్ టైమ్ యాక్టర్ జయ సాహాతోనూ డ్రగ్స్ కి సంబంధించిన చర్చ వేడెక్కిస్తోంది. డ్రగ్స్ బాగా పనికి వచ్చాయా? అంటూ రియాను ప్రశ్నించడం ఆ చాట్ లో బయటపడింది. అంతేకాదు.. డ్రగ్స్ విషయంలో శృతిని కోఆర్డినేట్ చేయమని అడిగాను.. చాలా ధన్యవాదాలు! అంటూ రియా సందేశాన్ని పంపింది. ఇక డ్రగ్ దందాతో రియా సోదరుడి లింకులు బయటపడడం మరో కొత్త కోణం. సుశాంత్ ఇంటి సిబ్బంది శామ్యూల్ మిరాండాతో రియా చక్రవర్తి జరిపిన మరో మెసేజ్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది కూడా డ్రగ్స్ విషయమై జరిగిన సంభాషణ కావడంతో వారిని సీబీఐ విచారిస్తోంది.అంతేగాక శామ్యూల్ మిరాండా, రియా మధ్య జరిగిన చాట్‌ను కూడా వెల్లడైంది. ఇందులో.. ‘హాయ్ రియా, విషయం దాదాపుగా ముగిసింది. అని మిరాండా చెప్పారు. ఈ సంభాషణ 2020 ఏప్రిల్ 17 న జరిగింది. ఆ తరువాత మేము షోవిక్ స్నేహితుడి నుంచి డ్రగ్స్ తీసుకోవచ్చా? కానీ అతని దగ్గర హాష్, (బడ్‌) మొగ్గ మాత్రమే ఉన్నాయి. అని మిరాండా రియాను అడిగారు. అయితే హాష్, మొగ్గ అనేవి తక్కువ తీవ్రత కలిగిన డ్రగ్స్‌గా పరిగణిస్తారు. ఇక ప్రస్తుతం డ్రగ్‌ డీలర్‌తో జరిగిన ఈ సంభాషణను చూస్తుంటే రియాపై మరింత అనుమానాన్ని పెంచుతున్నాయి. రియా చక్రవర్తిని సీబీఐ అధికారులు ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.మరోవైపు ఈడీ లేఖతో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగింది. సుశాంత్ కేసులో రియాను ఈడీ ఇప్పటికే రెండుసార్లు విచారించింది. కాగా, ఈడీ లేఖతో సుశాంత్ కేసు ఇపుడు కీలక మలుపు తిరిగింది. ఇపుడు రియాను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో కూడా అదుపులోకి తీసుకుని విచారించే అవకాశాలు లేకపోలేదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos