అత్యాచారాల భారతం

అత్యాచారాల భారతం

న్యూఢిల్లీ: భారత్ ‘మేక్ ఇన్ ఇండియా’ నుంచి క్రమంగా ‘రేప్ ఇన్ ఇండియా’ (అత్యాచారాల భారతం) వైపుకు మళ్లుతోందని లోక్సభలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ నేత అధీర్ రంజన్ చౌదరి వ్యాఖ్యానించారు. ఇటీవల ఉత్తరప్రదేశ్, తెలంగాణలో జరిగిన అత్యాచార, హత్యా ఘటనలను ప్రస్తావించిన అధీర్ ఈ మేరకు స్పందించారు. దేశంలోని మహిళలు, పిల్లలు, ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న హింసపై కాంగ్రెస్ పార్టీ సభ్యుడుకొడికున్నిల్ సురేష్ వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించారు. దీనిపై జరిగిన చర్చలో అధీర్ రంజన్ పాల్గొన్నారు. ప్రతీ అంశంపై మాట్లాడే ప్రధానమంత్రి దేశంలో మహిళలపై అత్యాచారాలు అంతకంతకూ పెరిగిపోతున్నా ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని, మౌనాన్నే ఆశ్రయిస్తున్నారని, ఇది అత్యంత దురదృష్టకరమని దుయ్యబట్టారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos