కుక్కపిల్లలు రక్షించడానికి పోలీసు అధికారి సాహసం..

కుక్కపిల్లలు రక్షించడానికి పోలీసు అధికారి సాహసం..

బావిలో పడ్డ కుక్క పిల్లలను రక్షించడానికి ఓ పోలీసు చేసిన సాహసం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని అర్మోరాలో ఓ పాడుబడ్డ బావిలో కుక్కపిల్లలు పడిపోవడంతో స్థానికులు 112కు సమాచారం అందించారు.కొద్దిసేపటి అనంతరం అక్కడికి చేరుకున్న పోలీసులు బావిలో పడిపోయిన కుక్కపిల్లలను రక్షించడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.దీంతో   పోలీసులు అధికారి స్వయంగా రంగంలోకి దిగారు. నేరుగా బావిలోకి దిగేందుకు ప్రయత్నిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. అందులో పాములు ఉన్నాయని, దిగితే ప్రాణాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని హెచ్చరించారు. అయినప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదు. బావిలోకి దిగి మూడు పప్పీలను రక్షించి బయటకు తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రాణాలకు తెగించి కుక్క పిల్లలను రక్షించిన పోలీసు అధికారిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. పప్పీలను రక్షిస్తున్న ఫొటోలను యూపీ  పోలీస్ విభాగం తమ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ‘బిగ్ సెల్యూట్ టు ఆఫీసర్అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos