టీకా అభివృద్ధిలో ఆస్ట్రాజెనికా- ఆక్స్‌ఫర్డ్‌ ముందంజ

టీకా అభివృద్ధిలో ఆస్ట్రాజెనికా- ఆక్స్‌ఫర్డ్‌ ముందంజ

లండన్: ఆస్ట్రాజెనికా- ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ఫలితాలు అశాజనకంగా ఉన్నట్టు రిసెర్చ్ స్క్వేర్ జర్నల్’లో ప్రచురించారు. కొత్త పద్ధతులను వినియోగించి వ్యాక్సిన్ ఏ విధంగా రోగ నిరోధకతను ఉత్తేజపరుస్తుందనే విషయాల్ని పరిశోధకులు గుర్తించారు. మానవ శరీరంలో జన్యు సూచనలను ఇది పాటిస్తుందా? అనే విషయాన్ని గుర్తించడంలో ఈ పరిశోధన చాలా కీలకమని బ్రిస్టల్స్ స్కూల్ ఆఫ్ సెల్యూలార్ అండ్ మాలిక్యూలర్ మెడిసిన్(సీఎంఎం) వైరాలజీ పరిశోధకులు తెలిపారు. ఈ వ్యాక్సిన్ శరీరంలో పరిశోధకులు ఊహించినట్లుగానే పని చేస్తోందని పరిశోధనలో తేలింది. టీ కా మానవ కణాల లోపలికి చేరినప్పుడు ఏమి జరుగుతుందో పరిశీలించడానికి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నట్లు పరిశోధకులు తెలిపారు.పెద్ద మొత్తంలో కరోనా వైరస్ స్పైక్ ప్రోటీన్ ఉత్పత్తి అవుతున్నట్టు అధ్యయనంలో భాగంగా నిర్ధారణకు వచ్చినట్లు వివరించారు. రోగ నిరోధక ప్రతి స్పందనను ప్రేరేపించడంలో టీకా విజయాన్ని వివరించడానికి తాము చేసిన పరిశోధన తోడ్పడుతుందని వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos