సస్పెండ్‌ ఎంపీల రాత్రి జాగారం.. 50 గంటల్లో పొద్దున్నే ఇలా..

సస్పెండ్‌ ఎంపీల రాత్రి జాగారం.. 50 గంటల్లో పొద్దున్నే ఇలా..

న్యూ ఢిల్లీ: నిత్యావసరాల ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, జీఎస్టీ వంటి సమస్యలు పార్లమెంట్ ఉభయ సభలను కుదిపేస్తున్నాయి. వీటిపై తక్షణమే చర్చ చేపట్టాలని, ప్రభుత్వం సమాధానం చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. బుధవారం సైతం ప్రతిపక్ష సభ్యులు పట్టువీడకపోవడంతో ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొన సాగింది. సస్పెండైన విపక్ష సభ్యులు బుధవారం పార్లమెంట్ ప్రాంగణంలో గాంధీ విగ్రహం వద్ద రిలే నిరసన ప్రారంభించారు. 50 గంటల పాటు నిరసన కొనసాగి స్తామన్నారు. 20 మంది రాజ్యసభ సభ్యులకు నలుగురు లోక్సభ సభ్యులూ తోడయ్యారు. వారికి విపక్షాలు ఆహారం, నీరు అందిస్తున్నాయి. నిరసనలో టీఆర్ఎస్ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పాల్గొన్నారు. పలు పార్టీల నేతలు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యను కలిసి సస్సెన్షన్ ఎత్తేయాలని కోరారు. సదరు ఎంపీలు విచారం వ్యక్తం చేస్తేనే అది సాధ్యమని చెప్పారు. అందుకు వారు తిరస్కరించారు. నిరసనల్లో భాగంగా ఎంపీలందరూ పార్లమెంట్ ఆవరణలోనే నిద్రించారు. రాత్రంతా జాగారం చేసినట్టు తెలుస్తోంది. పార్లమెంట్ వద్దే గురువారం ఉదయమే 6 గంటలకు టీ, 8 గంటలకు టిఫిన్ చేసినట్టు సమాచారం. దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ నేతలు ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. మోదీ సర్కా రు దిగొచ్చి విపక్షాల డిమాండ్ మేరకు ధరల పెరుగుదల, సామాన్య ప్రజల కష్టాలపై పార్లమెంట్లో చర్చకు సిద్ధపడే సంకేతాలు కనిపిస్తున్నాయి. చర్చకు తాము సిద్ధమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ వెల్లడించారు. ధరలపై వచ్చేవారం చర్చ ఉండొచ్చని ప్రతిపక్షాలు చెబుతున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos