దళిత నేతకు కులం దెబ్బ

దళిత నేతకు  కులం దెబ్బ

బెంగళూరు: భాజపా సీనియర్ నేత, చిత్రదుర్గ లోక్సభ సభ్యుడు ఎ.నారాయణ స్వామి సొంత నియోజక వర్గంలోనే కుల దుర హంకారానికి గురయ్యారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద పేదలకు ఇళ్ల నిర్మాణం గురించి చర్చించేందుకు సోమవారం సాయంత్రం యాదవుల ఆధిపత్యం ఎక్కువగా ఉన్న పావడగ తాలూకా, గొల్లర హట్టి గ్రామానికి వెళ్లారు. బయోకాన్, నారాయణ్ హృదయాలయ ప్రతినిధులు కూడా ఆయన వెంట వెళ్లారు. నారాయణ స్వామి ఆ గ్రామాన్ని చేరుకోగానే కొందరు స్థానికులు అడ్డుకున్నారు. ‘దళితులకు ప్రవేశం లేదు’ అని ఆయనతోనే నేరుగా చెప్పారు. పేదలను ఆదుకోవటమే కునేందుకే తాము వచ్చినట్లు చెప్పినా గ్రామం వెలుపలే కూర్చోవాలని నారాయణ స్వామిని కుర్చీ వేశారు. వాదోప వాదాల తర్వాత కొందరు ఆయన్ను గ్రామంలోకి ఆహ్వానించారు. కానీ వారి ఆహ్వానాన్ని మన్నించకుండానే వెనుదిరిగారు. ‘పోలీసుల సాయంతో తాను గ్రామంలోకి అడుగుపెట్టవచ్చు. అలా చేయడం తనకు ఇష్టం లేదు. వాళ్ల (గ్రామస్థుల) ఆలోచనా ధోరణిలో మార్పురావాలి. వారిపై కేసు నమోదు చేయాలని అనుకోవడం లేదు. అంటరానితనం ఇప్పటికీ కొనసాగుతోంది. ముందుగా మన మనసుల్లో మార్పు రావాలి. చట్టాలు చేసినంత మాత్రాన సరిపోదు. చట్టాలతో మనసులు మార్చలేం’ అని విలేఖరులతో ఆయన అన్నారు. గతంలో కూడా మాజీ ఎమ్మెల్యే తిమ్మరాయప్పనూ దళి తుడనే కారణంగా గ్రామంలోకి స్థానికులు రానివ్వ లేదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos