జీవించే హక్కును హరించిన రాజకీయ పక్షాలు

జీవించే హక్కును హరించిన రాజకీయ పక్షాలు

హైదరాబాద్: ‘దిశ’ నిందితుల్ని పోలీసులు ఎదురు కాల్పుల పేరిట హతం చేయటాన్ని ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి సమర్థించడం దురదృష్టకరమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ బుధవారం ఇక్కడ వ్యాఖ్యానించారు. మహిళలపై జరుగుతున్న దాడులను కుల, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. కేవలం అగ్రకుల మహిళలపై దుర్గటనలు జరిగితేనే అగ్రకుల నేతలు ఆందోళన చేసి, పార్లమెంట్ వరకు చర్చించడం పాలక వర్గాలలో పక్షపాత ధోరణులకు నిదర్శనమని దుయ్యబట్టారు. ‘దిశ’ ఘటనకు ముందు టేకు లక్ష్మి, సుద్దాల శైలజ, కల్పన, ఇంకా అనేక మంది దళిత, బహుజన మహిళలు, బాలికలు అత్యాచారానికి ,హత్యలకూ గురైనా ఇంత వరకు వారి కుటుంబాలను ఏ ఒక్క నేతా పలకరించలేదన్నారు. సత్వర న్యాయం కోసం త్వరిత గతిన విచారణ జరిపై న్యాయస్థానాల్ని ఏర్పాటు చేసి నిందితులను శిక్షించలేదని తప్పుబట్టారు. తప్పు ఎవరు చేసినా చట్టబద్ధమైన కఠిన శిక్షలు విధించాలని, జీవించే హక్కును వ్యక్తులు, సంస్థ లు, రాజకీయ పక్షాలూ హరించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos