అన్నం తింటున్నాడా..అందం తింటున్నాడా..

  • In Film
  • May 28, 2020
  • 155 Views
అన్నం తింటున్నాడా..అందం తింటున్నాడా..

టాలీవుడ్ హీరో మహేశ్ బాబు తాజా ఫొటో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. లాక్ డౌన్ సమయంలో ఇంట్లోనే ఉండి, ఫిట్ నెస్ ను మరింతగా పెంచుకున్న మహేశ్, ఫిజిక్‌తో పాటు తన అందాన్ని కూడా పెంచుకుని మరింత యంగ్‌గా కనిపిస్తున్నారు.తన లేటెస్ట్ పిక్‌ను  ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా, గౌతమ్‌కు అన్నయ్య ఉన్నాడా? అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. మహేష్ అన్నం తింటున్నాడా.. అందం తింటున్నాడా అనే డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. ఈయన వయసు దాచుకునే యంత్రమేమైనా కనిపెట్టడా.. అందుకే ఇలా రోజురోజుకీ యంగ్ గా అయిపోతున్నాడా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పిక్ లో కుమార్తె సితారతో మిర్రర్ సెల్ఫీని మహేశ్ తీసుకుంటున్నారు. కళ్లు తిప్పుకోలేనంత అందంగా మహేశ్ బాబు కనిపిస్తుండగా, తన యంగ్ ఏజ్‌లో కూడా మహేశ్‌ ఇంతలా ఆకట్టుకునే రూపంతో ఉండి ఉండరని, అంత బాగున్నారని కామెంట్లు వస్తున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos