మళ్లీ నష్టాల వ్యాపారమే

మళ్లీ నష్టాల వ్యాపారమే

ముంబై : స్టాక్ మార్కెట్లు సోమవారం ముప్పావు గంట విరామం తర్వాత మళ్లీ వ్యాపారాల్ని ఆరంభించాయి. సూచీలు 10 శాతం కంటే కిందకు దిగజారాయి. ఉదయం 11.10 గంటలకు సెన్సెక్స్ 3,036 పాయింట్లు నష్టపోయి 26,879 పాయింట్ల వద్ద, నిఫ్టీ 886 పాయింట్లు నష్టపోయి 7,858 వద్ద నిలిచాయి. 10.30 గంటలకు సూచీలు 10శాతం పడిపోవడంతో ట్రేడింగ్ను తాత్కాలికంగా 45 నిమిషాల పాటు నిలిపి వేసారు. లాక్డౌన్ అమలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పాలకులు హెచ్చరించటంతో మార్కెట్లు నష్టాల పాలయ్యాయి. సూచీలు మధ్యాహ్నం ఒంటి గంటలోపు 15 శాతం కుంగిపోతే 1.45 గంటలు ట్రేడింగ్ను నిలిపివేస్తారు. 1-2 గంటల మధ్య 15 శాతం మేర క్షీణిస్తే 45 నిమిషాల పాటు ట్రేడింగ్ ఆపేస్తారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత 15 శాతం క్షీణత నమోదైతే తర్వాత ట్రేడింగ్ను ఆ రోజంతా పూర్తిగా నిలిపేస్తారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos