ఇష్టా రాజ్యంగా భూముల పందారం

ఇష్టా రాజ్యంగా భూముల పందారం

అమరావతి: అప్పు తెచ్చి అమరావతి నిర్మిస్తామని తెదేపా ప్రభుత్వం చెప్పినందునే రుణ సాయంలో ప్రపంచ బ్యాంకు వెను కంజ వేసిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి తెలిపారు. సోమవారం శాసనసభలో ఆయన ప్రసంగించారు. ‘రాయల సీమ కరవుతో అల్లాడుతుంటే అమరావతి కోసం అప్పు తీసుకురావాల్సిన అవసరం ఉందా? ఉపాధి లేక ఉత్తరాంధ్ర ప్రజలు వలస వెళ్తున్నార’ని ఆక్రోశించారు. ‘ఒక పద్ధతి అంటూ లేకుండా వివిధ సంస్థలకు అమరావతిలో గత ప్రభుత్వం ప్రైవేట్ సంస్థ లకు 1300 ఎకరాలు ఇచ్చింది. ఎకరానికి రూ.కోటి చొప్పున కేంద్ర సంస్థలకు 60 ఏళ్ల లీజుకు, కొన్ని బ్యాంకులకు ఎకరా నికి రూ.నాలుగు కోట్ల చొప్పున, రూ.50 లక్షల చొప్పున విట్కు 200 ఎకరాలు, ఎస్ఆర్ఎం వర్సిటీ 200 ఎకరాలు, అమృత వర్సి టీకి 200 ఎకరాలు, ఇండో యూకే ఆస్పత్రికి 150 ఎకరాలు, మెడ్సిటీకి 100 ఎకరాల భూములు, కన్వెన్షన్ సెంటర్ల కోసం పీపీపీ మోడల్లో నచ్చిన వారికి భూములిచ్చింద’ని వివరించారు. లంక భూముల్ని కూడా స్వాహా చేసిందని ఆరోపించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos