బెండతో మధుమేహానికి చెక్

బెండతో మధుమేహానికి చెక్

మారుతున్న జీవన శైలి కారణంగా మధుమేహం వ్యాధి మహమ్మారిలా విజృంభిస్తోంది. దీనిని అదుపులో పెట్టడానికి వ్యాధిగ్రస్తులు అనేక అవస్థలు పడుతుంటారు. వాకింగ్‌కు వెళ్లడం, మితహారాన్ని పలు దఫాలుగా తీసుకోవడం, చక్కెర లేని కాఫీ, టీలను సేవించడం లాంటివి ఇందులో కొన్ని. ఇదే క్రమంలో మధుమేహాన్ని అదుపులో పెట్టడానికి బెండ అద్భుతంగా పని చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇందులోని పీచు పదార్థం శరీరంలో కొవ్వును కరిగించడమే కాకుండా చక్కెర నిల్వలను తగ్గించి, వాటి స్థాయులను స్థిరంగా ఉంచుతుందని వివరించారు. టైప్-2 మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో కాలేయం వద్ద కొవ్వు కరిగి, జీవక్రియ మెరుగుపడుతుందని వెల్లడించారు. బెండను ముక్కలుగా కోసి రాత్రంతా నానబెట్టి, ఉదయం ఆ రసాన్ని తాగితే మెరుగైన ఫలితాలు వచ్చాయని తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos