ఏపీలో కరెంట్, నీళ్లు లేవు.. రోడ్లు అధ్వాన్నం

ఏపీలో కరెంట్, నీళ్లు లేవు.. రోడ్లు అధ్వాన్నం

హైదరాబాదు: ఆంధ్రప్రదేశ్ లో కరెంట్ లేదు, నీళ్లు లేవు. రోడ్లన్నీ అధ్వాన్నంగా ఉన్నాయని మంత్రి కేటీర్ శుక్రవారం ఇక్కడ క్రెడాయ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. ‘సొంతూళ్లకు వెళ్లొచ్చిన నా మిత్రులు ఈ విషయాన్ని చెప్పారు. ఏపీలో ఉంటే నరకంలో ఉన్నట్టు ఉందంటున్నారు. బెంగళూరు కంపెనీలూ ఏపీలోని అధ్యాన్నపు రోడ్ల గురించి మాట్లాడుతున్నాయ’న్నారు. ‘తెలంగాణ చాలా ప్రశాంతమైన రాష్ట్రం. దేశంలోనే హైదరాబాద్ బెస్ట్ సిటీ. తెలంగాణలో అభివృద్ధి ఎలా ఉందో ఏపీ ప్రజలకు అర్థమైంది. నగరాల్లో మౌలిక సదుపాయాలను ఎప్పటికప్పుడు అభివృద్ధి చేయకపోతే వెనుకపడిపోతామ’న్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos