పొరబాటును అంగీకరించిన రాహుల్

పొరబాటును అంగీకరించిన రాహుల్

న్యూఢిల్లీ: రాఫేల్‌ తీర్పును తప్పుగా వ్యాఖ్యానించినందుకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విచారాన్ని వ్యక్తీకరించారు. ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానానికి సోమవారం ప్రమాణ పత్రాన్ని సమర్పించారు. ఎన్నికల ప్రచార జోరులో చేసిన వ్యాఖ్యల నుంచి ప్రత్యర్థులు లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని వివరించారు. తాను చేసిన వ్యాఖ్యల్ని కోర్టు ఎప్పుడూ పేర్కొన లేదని ప్రమాణ పత్రంలో స్పష్టీకరించారు. న్యాయ స్థానాన్ని రాజకీయాల్లోకి లాగే ఉద్దేశం తనకు లేదన్నారు. దీనిపై ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్ట నుంది. రాఫేల్‌ వివాదం పై అత్యున్నత న్యాయస్థానం చేయని వ్యాఖ్యలను రాహుల్ ఉల్లేఖించి నట్లు భాజపా పార్లమెంటు సభ్యులు మీనాక్షీ లేఖీ న్యాయస్థానంలో ఆయనకు వ్యతిరేకంగా వ్యాజ్యాన్ని దాఖలు చేసారు. దీనికి ఏప్రిల్‌ 22లోగా సమాధానం ఇవ్వాలని న్యాయస్థానం రాహుల్‌ను ఆదేశించింది. రాహుల్‌ గాంధీ అన్నట్లుగా తాము ఎప్పుడూ వ్యాఖ్యానించ లేదని, అలాంటి అభిప్రాయాలను కూడా వెల్లడించలేదని న్యాయస్థానం పేర్కొంది. రఫేల్‌ ఒప్పందంపై ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాల విచారణకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించిన విషయం తెలిసిందే. దీనికి రాహుల్‌ స్పందించారు. ‘దేశం మొత్తం చౌకీ దారే దొంగ అంటోంది. ఇప్పుడు సుప్రీం కోర్టు కూడా న్యాయం గురించి మాట్లాడింది’ అని వ్యాఖ్యలు చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos