జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్‌కు చేదు అనుభవం

జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్‌కు చేదు అనుభవం

అనంతపురం: దివాకర్ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డికి ఉన్నత న్యాయస్థానంలో చేదు అనుభవం ఎదురైంది. అత్యున్నత న్యాయస్థానం నిషేధించిన వాహనాలను ఎలా నడుపుతారని నిదీసింది. వాటి వల్ల ఎదురయ్యే ప్రమాదాలకుఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలని డిమాండ్ చేసింది. మోసపూరిత పనులను అనుమతించమని తెల్చి చేప్పింది. బెయిల్ వినతిని తిరస్కరించింది. దీంతో ఉన్నత న్యాస్థానంలో మూడు కేసుల్లో దాఖలు చేసిన బెయిల్ వినతిని జేసీ కుటుంబసభ్యులు ఉపసంహరించుకున్నారు. కింది న్యాయస్థానంలో బెయిల్ దరఖాస్తుకు ఉన్నత న్యాయస్థానం అనుమతించింది. సుప్రీంకోర్టు నిషేధించిన బీఎస్-3 వాహనాలను బీఎస్-4గా చూపి రిజిస్ట్రేషన్ చేయించి దివాకర్ ట్రావెల్స్ అక్రమాలకు పాల్పడిన విషయం తెలిసిందే. 154 బస్సులు, లారీలను నకిలీ దాఖలాలతో నమోదు చేశారు. నాగాలాండ్ రాష్ట్రంలో కూడా పలు వాహనాలకు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారు. ప్రస్తుతం జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్లు కడప కేంద్ర కారాగరంలో బంధీలుగా ఉన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos