జమ్ము-కాశ్మీర్కు ప్రత్యేక హోదా పునరుద్ధరించాలి

జమ్ము-కాశ్మీర్కు ప్రత్యేక హోదా పునరుద్ధరించాలి

శ్రీనగర్ : జమ్ముకాశ్మీర్కు ప్రత్యేక హోదాను పునరుద్ధరించాలని ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలో ఇక్కడ సమావేశమైన పీపుల్స్ అలియన్స్ ఫర్ గుప్కర్ డిక్లరేషన్ (గుప్కర్ కూటమి) (పిఎడిజి) డిమాండ్ చేసింది. 2019 ఆగస్టులో జమ్ముకాశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని కల్గించే అధీకరణ 370ని ఏకపక్షంగా రద్దు చేసిన కేంద్రం, అనంతరం రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన సంగతి విదితమే. దీనికి వ్యతిరేకంగా ఆరు ప్రాంతీయ పార్టీలు రాష్ట్రం విడిపోకముందు పిఎడిజిగా ఏర్పడ్డాయి. రాజ్యాంగ విరుద్ధంగా రాష్ట్రాన్ని ముక్కలు చేయటాన్ని దూకుడు చర్యగా గుప్కర్ కూటమి అభివర్ణించింది. ‘మా హక్కులు మాకు తిరిగి ఇవ్వాలి. రాజకీయ సమస్య పరిష్కారానికి కలిసి రావాల’ ఫరూఖ్ అబ్ధుల్లా ఇతర పక్షాలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ, జమ్ము కాశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్ పార్టీలు ఈ కూటమి నుండి వైదొలగటంతో ఇప్పుడు ఈ కూటమిలో ఐదు పార్టీలు మాత్రమే ఉన్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos