హోసూరు దర్గా చెరువులో ప్రబలుతున్న గుర్రపు డెక్క

హోసూరు దర్గా చెరువులో ప్రబలుతున్న గుర్రపు డెక్క

హోసూరు : హోసూరు దర్గా చెరువులో రోజురోజుకూ పెరుగుతున్న గుర్రపు డెక్కను తొలగించేందుకు చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. హోసూరు-బెంగళూరు జాతీయ రహదారిలోని దర్గా సమీపంలో గల చంద్రాంబుది చెరువును (దర్గా చెరువు) కర్ణాటక రాజులైన తలకాడు గంగ రాజుల కాలంలో నిర్మించారు. ఒకప్పుడు హోసూరుకు ప్రధాన నీటి వనరుగా ఉండేది. హోసూరు ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడంతో ప్రస్తుతం దర్గా చెరువు కలుషితమవడమే కాకుండా ఆక్రమణల కు గురయింది. చెరువుకు వచ్చే నీటి కాలువలు పూర్తిగా ఆక్రమణలకు గురి కావడంతో వర్షపు నీటి కన్నా హోసూరు పట్టణంలోని మురికినీరు ఎక్కువగా చేరుతున్నది. దీనికి తోడు గుర్రపు డెక్క పెరగడంతో చెరువులో నీరు మరింత కలుషితమైంది. దీంతో ఆ ప్రాంతంలో దుర్వాసన వెదజల్లడంతో జాతీయ రహదారిపై వాహనాలపై వెళ్లే వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దర్గా చెరువులో రోజు రోజుకు ఎక్కువవ్తుతున్న గుర్రపు డెక్క ను తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos