గడ్డన పడిన విపణులు

గడ్డన పడిన విపణులు

ముంబై: కరోనా భయాలతో భారీ నష్టాలను మూటగట్టుకున్న స్టాక్ మార్కెట్లు శుక్రవారం కాస్త గడ్డన పడ్డాయి. ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కించడానికి కేంద్ర ప్రభుత్వం తాయిలాలను ప్రకటిస్తుందనే అంచనాలతో మదుపర్లలో నమ్మకం కుదిరింది. సెన్సెక్స్ 1,628 పాయింట్లు లాభపడి 29,916కి ఎగబాకింది. నిఫ్టీ 482 పాయింట్లు పెరిగి 8,745కి చేరుకుంది. అన్ని సూచీలు లాభ పడ్డాయి. ఇంధనర్జీ షేర్లు 9 శాతం పైగా చమురు,లోహాలు, సమాచార సాంకేతికత, స్టాకులు 8 శాతానికి పైగా లాభపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్లో ఓఎన్జీసీ (18.58%), అల్ట్రా టెక్ సిమెంట్ (13.01%), హిందుస్థాన్ యూనిలీవర్ (11.75%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (11.24%), టీసీఎస్ (9.90%) లాభపడ్డాయి. హెచ్డీఎఫ్సీ (-1.39%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.88%) నష్టపోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos