సంకల్పం ముందు తలొంచిన వైకల్యం..

సంకల్పం ముందు తలొంచిన వైకల్యం..

సంకల్పానికి వైకల్యం ఏ మాత్రం అడ్డుకాదన్న విషయాన్ని రుజువు చేయటమే కాదు.. ప్రయత్నిస్తే అసాధ్యమైనది ఏదీ లేదంటూ మహారాష్ట్రకు చెందిన ప్రాంజిల్ పాటిల్ అనే మహిళ రుజువు చేశారు.చిన్నప్పుడే కంటి చూపు కోల్పోయిన ఐఏఎస్ కావాలనే తన లక్ష్యాన్ని సాధించుకోవడానికి పట్టుదలతో శ్రమించారు. అనుకున్నట్లే ఆమె అనుకున్నది సాధించారు. అనేక సవాళ్లు.. అవరోధాల్ని అధిగమించి సివిల్ సర్వీసులకు ఎంపికైన తొలి అంధమహిళగా నిలిచారు.ఈ క్రమంలో కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ కె. గోపాలకృష్టన్ – ఇతర సిబ్బంది సమక్షంలో జిల్లా సబ్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. తిరువనంతపురంలో బాధ్యతలు చేపట్టటం తనకు చాలా గర్వంగా ఉందన్నారు.సబ్ కలెక్టర్ బాధ్యతల్ని స్వీకరించిన తొలి అంధ మహిళగా సరికొత్త రికార్డును సృష్టించారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos