దిశ హత్యాచార నిందితులది బూటకపు ఎన్‌కౌంటర్

దిశ హత్యాచార నిందితులది బూటకపు ఎన్‌కౌంటర్

హైదరాబాదు: దిశ హత్యాచార అనుమానితుల్ని పోలీసులు బూటకపు ఎదురు కాల్పుల్లో హత మార్చారని పౌర హక్కుల సంఘం బుధ వారం ఇక్కడ ఆరోపించింది. ఇతరుల ప్రయో జనాల్ని కాపాడేందుకో లేక మరో ఉద్దేశంతోనో పోలీసులు కుట్ర పన్ని మారణ కాండకు పాల్పడ్డారని ధ్వజ మెత్తారు. బాధ్యులపై జాతీయ మానవ హక్కుల సంఘం కఠిన చర్యలు తీసు కోవాలని డిమాండ్ చేశారు. పౌరహక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య లక్ష్మణ్ ఆధ్వర్యంలోని బృందం బుధవారం ఎదురు కాల్పుల బాధితుల తల్లిదండ్రులను నారాయణ పేట జిల్లా మక్తల్ మండలం గుడిగండ్ల, జక్లేర్ గ్రామాల్లో కలిసి విచారించారు. లక్ష్మణ్ విలేఖరులతో మాట్లా డారు. ‘ నిందితులు చేసింది ముమ్మాటికీ నేరమే అయినా విచారణ లేకుం డా శిక్షించే అధికారం పోలీసులకు ఎక్కడిది? బాధితుడైన దిశ తండ్రి కూడా సత్వర న్యాయాన్నిడిమాండ్ చేసారే తప్ప చట్టాన్ని చేతుల్లోకి తీసుకోమని కోరలేదు. నిందితులు పరుగెత్తే స్థితిలో లేరు. వారికి తుపాకీ పేల్చడం రాదని వారి తల్లి దండ్రులు చెప్పారు. నిందితులు ఎదురు తిరగదలిస్తే వారిని అదుపులోకి తీసుకునేటపుడే ఆ పని చేసేవారని చెన్నకేశవుల తండ్రి కురు మయ్య మాటలు ప్రస్తావనార్హ మన్నారు. దిశ సెల్ ఫోన్ సంఘటన స్థలంలో దొరికిందని పోలీసులు చెబుతుంటే, గుడిగండ్ల గుట్టమీద దొరికిందని నవీన్ తల్లి లక్ష్మి చెబుతోందన్నారు. ఇవన్నీ పోలీసుల వైఖరిపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయ’ని లక్ష్మణ్ వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos