ఆటకు ముందే పాక్ ను చూసి భారత ఆటగాళ్లు భయపడ్డారు

ఆటకు ముందే పాక్ ను చూసి భారత ఆటగాళ్లు భయపడ్డారు

కరాచి : టి 20 వరల్డ్ కప్ లో ఆటలకు ముందు పాక్ ను చూసి భారత ఆటగాళ్లు భయపడిపోయారని పాకిస్థాన్ టీం మాజీ కెప్టెన్ ఇంజమాముల్ హక్ వ్యాఖ్యానించాడు. వారం తా తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారనే విషయం తోనే బయటపడిందన్నాడు. ‘టాస్ వేసేటప్పుడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, పాక్ కెప్టెన్ బాబర్ ఆజం బాడీ లాంగ్వేజ్ లో తేడా కొట్టొచ్చినట్టు కనిపించింది. బాబర్ ఆజంలో ఆత్మ విశ్వాసం, కోహ్లీ మొహంలో భయం, ఒత్తిడి కనిపించాయి. మొదటి మూడు ఓవర్లలో రోహిత్, రాహుల్ లు ఔటైనా పెద్ద నష్టమేమీ లేదు.రోహిత్ శర్మ ఔట్ అవడానికన్నా ముందే భారత్ ఒత్తిడిలో ఉంది. రోహిత్ శర్మే ఒత్తిడిలో ఉన్నాప్పాడు. టీ20ల్లో టీమిండియా చాలా గొప్ప జట్టు. గత మూడేళ్ల ప్రదర్శనను చూస్తే టీమిండియానే వరల్డ్ కప్ హాట్ ఫేవరెట్. వరల్డ్ కప్ లో వారి ప్రదర్శన అస్సలు బాగాలేదు. పాక్ మ్యాచ్ వారిపై ఒత్తిడిని పెంచింది. స్పిన్ ను బాగా ఎదుర్కొనే టీమిండియా ఆటగాళ్లే న్యూజిలాండ్ స్పిన్ ద్వయం శాంట్నర్, సోధిలకు పడిపోవడం చూస్తే జాలేస్తోంద’న్నాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos