పంటలపై ఏనుగుల దాడి

పంటలపై ఏనుగుల దాడి

హోసూరు : కృష్ణగిరి జిల్లా సూలగిరి సమీపంలో ఏనుగులు పంటలపై పడి ధ్వంసం చేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. సూలగిరి సమీపంలోని గ్రామాలకు చేరువలో గత కొద్ది రోజులుగా రెండు ఏనుగులు సంచరిస్తూ రైతులపై దాడి చేయడమే కాకుండా విలువైన పంటలను ధ్వంసం చేస్తున్నాయి. మంగళవారం రాత్రి సూలగిరి సమీపంలోని ఎలిసేపల్లి గ్రామం వద్ద గల మామిడి తోపులో చొరబడ్డ రెండు ఏనుగులు చెట్లను ధ్వంసం చేయడమే కాకుండా  టమోటా పంటను ధ్వంసం
చేశాయి. ఏనుగులు ప్రతి రోజు ఎలిసేపల్లి చుట్టుపక్కల సంచరిస్తూ పంటలను ధ్వంసం చేయడం వల్ల తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నెల రోజులుగా పంటలను ధ్వంసం చేస్తున్న ఏనుగులను తరిమివేయాలని అటవీశాఖ అధికారులకు విన్నవించినా, పట్టించుకోలేదని ఎలిసేపల్లి గ్రామ రైతులు వాపోయారు. అప్పులు చేసి పండించిన పంటలను ఏనుగులు ధ్వంసం చేయడంతో మరింత నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించి ఏనుగులను దూర ప్రాంత అడవులకు తరిమివేయడానికి చర్యలు చేపట్టాలని సూలగిరి ప్రాంత రైతులు డిమాండ్ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos