మరింత కాలం తీహార్‌ చెరసాల్లోనే శివకుమార్‌

మరింత కాలం తీహార్‌ చెరసాల్లోనే శివకుమార్‌

న్యూఢిల్లీ: నగదు అక్రమ బదిలీ కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివ కుమార్ జ్యుడిషియల్ కస్టడీని ఈ నెల 25వ తేదీ వరకూ ఢిల్లీ కోర్టు పొడిగిం చింది. జ్యుడిషియల్ కస్టడీ మంగళవారం ముగియడంతో ఆయనను అధికారులు కోర్టుకు హాజరు పరిచారు. తదుపరి విచారణ కోసం ఆయనను జ్యుడిషియల్ కస్టడీలోనే ఉంచాలని కోర్టుకు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ చేసిన వినతికి కోర్టు సానుకూలంగా స్పందించింది. ఇదే కేసులో ప్రశ్నిచేందుకు ఆయన తల్లి గౌరమ్మ, భార్య ఉష కూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోమవారం తాఖీదుల్ని జారీ చేసింది. దాదాపు నెలగా శివకుమర్ తీహార్ జైలులో ఉన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos