కేసీఆర్‌ ఆఫర్‌కు సబిత ఓకే ?

కేసీఆర్‌ ఆఫర్‌కు సబిత ఓకే ?

సబిత ఇంద్రారెడ్డి
వ్యవహరిస్తున్న తీరుపై అటు కాంగ్రెస్‌ ఇటు తెరాస రెండు పార్టీల్లోనూ తీవ్ర ఉత్కంఠత
నెలకొంది.కొద్ది రోజులుగా సబిత తన కొడుకు కార్తిక్‌రెడ్డితో కలసి తెరాసలో చేరడానికి
సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.అయితే సబిత తెరాసలో చేరనున్నట్లు
వస్తున్న వార్తలతో అప్రమత్తమైన కాంగ్రెస్‌ అధిష్టానం రేవంత్‌రెడ్డిని రంగంలోకి దించి
పరిస్థితిని చక్కదిద్దాలంటూ సూచించింది.అధిష్టానం సూచనలతో రంగంలోకి దిగిన రేవంత్‌రెడ్డి
సబిత ఇంట్లో సమావేశమై కార్తిక్‌రెడ్డికి చేవెళ్ల ఎంపీ సీటు ఇప్పిస్తానని హామీ ఇవ్వడంతో
పాటు స్వయంగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో కూడా చెప్పించడంతో సబిత వెనక్కి తగ్గినట్లు
భావించారు.అయితే కేసీఆర్‌ సబితను తెరాసలో చేర్చుకోవడానికి మరో వ్యూహాన్ని రచించారు.సబితకు
మంత్రి పదవి ఇవ్వడానికి అంగీకరించిన కేసీఆర్‌ సబిత కొడుకు కార్తిక్‌రెడ్డికి చేవెళ్ల
ఎంపీ సీటు ఇవ్వడానికి అంగీకరించలేదంటూ గతంలో వార్తలు వినిపించాయి.అయితే సబితను పార్టీలోకి
చేర్చుకోవడానికి నిర్ణయించుకున్న కేసీఆర్‌ సబితకు మంత్రిపదవితో పాటు కార్తిక్‌రెడ్డికి
ఎంపీ సీటుకు బదులు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానంటూ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.కేసీఆర్‌
ఒక మెట్టు దిగడంతో సబిత కూడా ఒక మెట్టు దిగి కేసీఆర్‌ ఆఫర్‌కు ఓకే చెప్పినట్లు సమాచారం.రోజుకో
మలుపు తిరుగుతున్న చేవెళ్ల చెల్లెమ్మ తెరాసలో చేరనుందో లేదా కాంగ్రెస్‌లోనే కొనసాగనుందో
ఇవాళ రేపటిలోపు తేలిపోనుంది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos