ప్రజాస్వామ్య పరిరక్షణకు సిపిఐ ఆందోళన

ప్రజాస్వామ్య పరిరక్షణకు సిపిఐ ఆందోళన

న్యూఢిల్లీ: ‘రాజ్యాంగాన్ని కాపాడండి, ప్రజాస్వామాన్ని పరిరక్షించండి’ అనే నినాదంతో సీపీఐ దేశవ్యాప్త ప్రచారం చేపట్టనుంది. జన వరి 26 నుంచి 30వ తేదీ వరకూ ఈ ప్రచారం చేపడుతున్నట్టు సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా తెలిపారు. సోమ వారం ఇక్కడ ఆయన విలేఖరులతో మాట్లాడారు. రాజ్యాంగంలోని ముందుమాటను ప్రజల చేత చదివించి రాజ్యాంగ పరిరక్షణకు పున రంకితమవుతామని ప్రతిజ్ఞ చేయిస్తామని చెప్పారు. పౌరసత్వ సవరణ చట్టానికి, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా తమ ఆందోళ నను ఉధృతం చేస్తామని వివరించారు. దేశం ఎదుర్కొంటున్న పలు సమస్యలు, ప్రస్తుత పరిస్థితి, కొనసాగుతున్న ఆందోళనపై విస్తృ త స్థాయిలో ఏకాభిప్రాయ సాధనకు తమ కార్యక్రమాలు దోహదకారి కాగలవని ఆశించారు. 26 నుంచి దేశవ్యాప్తం ప్రచారం చేప ట్టి, మహాత్మాగాంధీ బలి దానం రోజైన 30న రాజ్యాంగానికి పునరంకితం అవుతామని, రాజ్యాంగాన్ని నిరీర్వం చేసే ఎలాంటి ప్రయ త్నాలనైనా తిప్పికొడతామని ప్రజలతో ప్రతిజ్ఞ చేయిస్తామని వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos