కరోనా తగ్గు ముఖం

కరోనా తగ్గు ముఖం

న్యూ ఢిల్లీ: కరోనా కేసుల వృద్ధిలో భారత్ గరిష్ఠ స్థాయిని దాటేసిందని కేంద్ర ఆర్థిక శాఖ నెలవారీ సమీక్షలో పేర్కొంది. సెప్టెంబరు 17 నుంచి 30 వరకు కరోనా గణాంకాల్ని పరిశీలిస్తే కరోనా గరిష్ఠ స్థాయిని దాటేసినట్లే కనిపిస్తోందని తెలిపింది. గత నెల చివరి రెండు వారాల్లో రోజువారీ కేసుల సంఖ్య సగటున 93 వేల నుంచి 83 వేలకు తగ్గింది. అదే వ్యవధిలో రోజువారీ పరీక్షల సంఖ్య 1.15 లక్షల నుంచి 1.24 లక్షలకు పెరిగింది. అయితే వ్యాధి అంతరించటానికి సమయం పడుతుందని అంచనా వేసింది. ‘ సెప్టెంబరు 30 న ప్రపంచంలో కెల్లా అత్యధిక కేసులు భారత్లోనే నమోదయ్యాయి. ఆగస్టు 31 నాటికి 1.65% మేర పెరిగిన క్రియాశీలక కేసులు సెప్టెంబరు 30 నాటికి -0.4%కి పడిపోయాయి. రికవరీ కూడా 83.5%కి పెరిగింది. ఈ పరిణామాల దృష్ట్యా సెప్టెంబరు 17-30 తేదీల మధ్య రెండు వారాల పరిస్థితిని చూస్తే భారత్ పీక్ను దాటేసినట్లు కనిపిస్తోంది. ఇక ఆర్థిక వృద్ధి వేగం పుంజుకుంటుంద’ని నివేదిక పేర్కొంది. భారత్లో ద్వి, త్రిచక్ర వాహనాల అమ్మకాలు నిరుటి ఆగస్టు స్థాయికి చేరుకున్నాయి. ప్రైవేటు రవాణాకు డిమాండ్ పెరిగింది. వరుసగా రెండో ఏడాది సాధారణం కంటే అధిక వర్షాలు కురిశాయి. ట్రాక్టర్ల అమ్మకాలు పెరగడం ఖరీఫ్ సీజన్ బాగున్నట్లు లెక్క. మార్చి నుంచి రైల్వే సరకు రవాణా పెరుగుతూ వస్తోంది. అన్లాక్ మొదలుకావడం వల్ల ప్రయాణికుల ఆదాయం కూడా పెరుగుతోంది. సెప్టెంబరు నెల తొలి 20 రోజుల్లోనే రూ. 640.96 కోట్ల విలువైన టికెట్లు బుక్ అయ్యాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos