బ్రహ్మాజీకి సైరా హ్యాంగోవర్ తగ్గినట్లు లేదే..

  • In Film
  • October 14, 2019
  • 135 Views
బ్రహ్మాజీకి సైరా హ్యాంగోవర్ తగ్గినట్లు లేదే..

సైరా చిత్రంలో మెగాస్టార్ చిరంజీవికి సహాయ పాత్రలో పూర్తి నిడివి పాత్ర దక్కడంతో నటుడు బ్రహ్మాజీ ఇప్పటికీ ఆ హ్యాంగోవర్ నుంచి బయటపడలేకపోతున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం తనకు గుండు చేస్తున్నట్లుగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి కత్తెర పట్టుకొని నిల్చున్న పిక్ షేర్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసిన బ్రహ్మాజీ .. ఇప్పుడు గుర్రంపై స్వారీ చేస్తున్న వీడియోతో మ్యాజిక్ చేశాడు.ఓ గుర్రంపై స్వారీ చేస్తున్న ఈ వీడియో చూడగానే షాక్ కి గురవ్వాల్సిందే. అచ్చం ఒక వీరుడే ఇలా గుర్రంపై స్వారీ చేస్తున్నారా? అన్నంత సాలిడ్ గా కనిపిస్తున్నాడు. అసలే తలపాగా.. రాజరికం నాటి దుస్తులు.. వాటికి కరవాలం అచ్చం ఆ రోజుల్లో వీరాధివీరుడైన సైనికుడిలాగా కనిపిస్తున్నాడు.

View this post on Instagram

#horseriding #syeraamaking 😀

A post shared by Actor Brahmaji (@brahms25) on

తాజా సమాచారం

Latest Posts

Featured Videos