హోసూరులో శీతల గిడ్డంగిపై శీతకన్ను

హోసూరులో శీతల గిడ్డంగిపై శీతకన్ను

హోసూరు : హోసూరులో రూ.7 కోట్ల ఖర్చుతో నిర్మించి, నిరుపయోగంగా ఉన్న శీతల గిడ్డంగి, మార్కెట్ యార్డును వెంటనే ప్రారంభించాలని ఈ ప్రాంత రైతులు డిమాండ్ చేస్తున్నారు. హోసూరు మాజీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి హయాం నుంచి శీతల గిడ్డంగిని ఏర్పాటు చేయాలని హోసూరు ప్రాంత రైతులు డిమాండ్ చేస్తూ వచ్చారు. నాయకులు మారినా హోసూరు రైతుల కోరిక నెరవేరలేదు. పారిశ్రామికంగా హోసూరు ఎంతో అభివృద్ధి చెందింది. దానికి దీటుగా వ్యవసాయం కూడా ఎంతో పురోగతిని సాధించింది. ప్రస్తుతం రైతులు పండించిన కొన్ని రకాల పువ్వులు, కూరగాయలు నిల్వ ఉంచేందుకు శీతల గిడ్డంగి అవసరం ఏర్పడింది. హోసూరుకు ప్రాతినిధ్యం వహించిన నాయకులు శీతల గిడ్డంగి విషయాన్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండాపోయంది. హోసూరు ప్రాంత రైతుల పట్టుదలను గమనించిన మాజీ మంత్రి బాలకృష్ణారెడ్డి రూ.7 కోట్ల ఖర్చుతో శీతల గిడ్డంగి, మార్కెట్ యార్డు నిర్మాణానికి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించారు. రాయకోట రోడ్డులో శీతల గిడ్డంగి,మార్కెట్ యార్డును నిర్మించారు. నిర్మాణం పూర్తయి ఏడాదైనా ప్రారంభానికి నోచుకోక నిరుపయోగంగా మారింది. శీతల గిడ్డంగి నిర్మాణానికి కృషి చేసిన బాలకృష్ణారెడ్డి దానిని ప్రారంభించడానికి చర్యలు చేపట్టాలని హోసూరు ప్రాంత రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సత్వరమే గిడ్డంగిని ప్రారంభించడానికి కృషి చేయాలని వారు బాలకృష్ణారెడ్డిని కోరుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos