హాస్య నటునికి అందిన సాయం

హాస్య నటునికి అందిన సాయం

హోసూరు : ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన హాస్యనటుని కుటుంబానికి డీఎంకే ఎమ్మెల్యే వై. ప్రకాష్ ఆర్థిక సహాయం చేశారు. కృష్ణగిరి జిల్లా నాట్యంపాళ్యం సమీపంలోని శివలింగాపురం గ్రామానికి చెందిన పరంధామన్, అతని సహోదరుడు సహదేవన్‌ మరుగుజ్జులు కాగా తండ్రి పచ్చయప్ప మానసిక వికలాంగుడు. తల్లి కూలీ పనులు చేసి వీరిని పోషిస్తోంది. మరుగుజ్జు గా ఉన్న అన్నదమ్ములిద్దరూ పట్టభద్రులే. పరంధామన్ ఓ ప్రవేట్ ఛానల్ హాస్య నటుడుగా పని  చేస్తున్నాడు. చెన్నైలో రోజురో జుకూ పెరుగుతున్న కరోనా ప్రభావంతో టీవీ కార్యక్రమాలు ఆగిపోయాయి. వేరే పని లేక  పరంధామన్ ఇంటి దారి పట్టాడు. టీవీ కార్యక్రమం ద్వారా వస్తున్న కొద్దిపాటి సంపాదనతో కుటుంబాన్ని నెట్టుకొచ్చే పరంధామన్‌, గత మూడు నెలలుగా టీవీ లో కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోవడంతో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాడు. కుటుంబానికి తిండి కూడా కరువైంది. ఇదిలా ఉండగా హాస్యనటుడు పరంధామన్ పరిస్థితి గురించి  కొన్ని శాటిలైట్‌, యూట్యూబ్ ఛానళ్లు కథనాలు ప్రసారం చేశాయి. దీనిపై స్పందించిన దాతలు ఆ కుటుంబానికి నిత్యావసర వస్తువులను అందజేశారు. డీఎంకే పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ ఈ కథనాన్ని చూసి అతనికి ఆర్థిక సహాయం చేయాల్సిందిగా తళి ఎమ్మెల్యే వై. ప్రకాష్ ను ఆదేశించారు. స్టాలిన్ మాటకు కట్టుబడి ఎమ్మెల్యే ప్రకాష్ శివలింగాపురానికి చేరుకుని పరంధామన్ కుటుంబానికి నిత్యావసర సరుకులతో పాటు రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. కష్టాల్లో ఉన్న తమకు దాతలు ముందుకు వచ్చి సహాయం అందించడం ఎంతో ఊరట కలిగిందని  పరంధామన్ సంతోషం వ్యక్తం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos