మంత్రి మేరుగ వ్యాఖ్యలపై అసెంబ్లీలో దుమారం

మంత్రి మేరుగ వ్యాఖ్యలపై  అసెంబ్లీలో దుమారం

అమరావతి: దళితులకే పుట్టావా అంటూ తెదేపా ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి పై మంత్రి మేరుగ నాగార్జున చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీలో దుమారం రేపాయి. శాసనసభలో మంత్రికి వ్యతిరేకంగా సభా హక్కు ఉల్లంఘన తీర్మానాన్ని ప్రతిపాదించింది. తాను తేదేపా సభ్యుల్ని ఏమీ అనలేదని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించలేదని మేరుగ తెలిపారు. అయితే మేరగ చేసిన వ్యాఖ్యలన్నీ రికార్డుల్లో ఉన్నాయి. వాటిని తనిఖీ చేసి ఆ మాట అనలేదంటే రాజీనామా చేస్తానని బాల వీరాంజనేయస్వామి సవాల్ విసిరారు. ‘‘నాపై చేసిన వ్యాఖ్యలకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తారనుకున్నా. నా పుట్టుక గురించి అసెంబ్లీ మాట్లాడటం సరికాదు’’ అని అన్నారు. మేరుగ నాగార్జునకు మంత్రులు మద్దతుగా నిలిచారు. మంత్రి మేరుగను టీడీపీ సభ్యులు రెచ్చగొట్టడానికి ప్రయత్నించారని మంత్రి అంబటి రాం బాబు అన్నారు. బాలవీరాంజనేయ స్వామి హద్దు దాటి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎవరైనా దళితుల కుటుంబంలో పుట్టడానికి ఇష్టపడతారా అని గతంలో తెదేపా అధినేత చంద్రబాబు అన్న విషయాన్ని సభలో మంత్రి బుగ్గన్న రాజేంద్ర నాథ్ గుర్తు చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos