గోల్కొండలో బయటపడ్డ మరో కోట!

గోల్కొండలో బయటపడ్డ మరో కోట!

భాగ్యనగరిగా వెలుగొందుతున్న హైదరాబాద్‌ శతాబ్దాల ఘన చరిత్ర,కీర్తి వెనుక గోల్కొండ కోట పాత్ర ఎంతో కీలకమైనది.నేటికీ చెక్కు చెదకుండా పర్యాటకులను ఆకర్షిస్తూ హైదరాబాద్‌ నగరానికి తలమానికంగా నిలుస్తున్న గోల్కొండ కోట కింద మరో అద్భుతమైన కోట ఉన్నట్టు తెలుస్తోంది. కోట పక్కనే ఉన్న నయాఖిల్లాలో తవ్వకాలు జరుపుతుండగా, ఇక్కడ మరో కోట ఆనవాళ్లు బయట పడుతున్నాయి. గోల్ఫ్ కోర్స్ పక్కనే ఉన్న సుమారు 40 ఎకరాల స్థలంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) అధీనంలో ఇటీవల తవ్వకాలు మొదలయ్యాయి.తొలి రోజు నుంచే పురాతన వస్తువులు, రాతి శిలలు బయట పడుతూనే ఉన్నాయి. ఇవన్నీ 15 శతాబ్దం నాటివని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో గోల్కొండ భూగర్భంగా మరో కట్టడం ఉందని చరిత్రకారులు, ఏఎస్ఐ అంచనా వేస్తున్నారు. ప్రాంతాన్ని సందర్శించిన ఏఎస్ఐ సౌతిండియా రీజనల్ డైరెక్టర్ మహేశ్వరి, మరింత జాగ్రత్తగా తవ్వకాలను నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos