వాళ్లు రెబల్స్ కాదు.. ద్రోహులు

వాళ్లు రెబల్స్ కాదు.. ద్రోహులు

ముంబై : ‘‘వాళ్లు రెబల్స్ కాదు.. ద్రోహులు…’అని సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, మంత్రి ఆదిత్యఠాక్రే మంగళవారం ఒక మాధ్యమ సంస్థ ముఖాముఖిలో వ్యాఖ్యానించారు. ‘ఇక్కడి నుంచి పారిపోయి వాళ్లంతట వాళ్లే రెబల్ అని అనుకుంటున్నారు. తిరుగుబాటు చేయాలనుకుంటే ఇక్కడే ఉండి చేయాల్సింది. ఇలాంటి వారు ఎప్పటికీ గెలవలేరు. మాకు అందరి మద్ధతు ఉంది. మేం గెలుస్తామన్న నమ్మకం ఉంద’ న్నారు. అసెంబ్లీలో జరిగే విశ్వాస తీర్మానంలో గెలుస్తామన్న నమ్మకం తనకు ఉందని చెప్పారు. బల పరీక్ష కంటే ముందు నైతిక పరీక్ష జరగాలన్నారు. ఆ సమయంలో తిరుగుబాటు ఎమ్మెల్యేలు తన ముందు కూర్చొని, కళ్లలోకి చూస్తూ ప్రభుత్వం, శివసేన ఏం తప్పు చేసిందో చెబుతారని అన్నారు. మరో వైపు మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శివసేన ఎంపీ సంజయ్ రౌత్ను విచారించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పంపిన నోటీసులపైనా ఆదిత్య ఠాక్రే స్పందించారు. ‘‘ఇది రాజకీయం కాదు.. ఇప్పుడు ఇదొక సర్కస్లా మారింది’’ అని వ్యాఖ్యానించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos